Brahmamudi : రాజ్ కోసం హోటల్ లో వెయిట్ చేస్తున్న కావ్య.. వాళ్ళిద్దరు అతడిని చూస్తారా!
on Apr 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -683 లో.... ఒకవైపు నుండి రాజ్ దగ్గరికి కావ్య వస్తుంటే.. మరోవైపు నుండి రాజ్ దగ్గరికి యామిని వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ బావ పెళ్లి కి ఒప్పుకున్నందు అని చెప్తుంది. అలా చెప్పగానే కావ్య, అప్పు ఇద్దరు షాక్ అవుతారు. నాన్న గురించి అలోచించి ఈ పెళ్లికి ఒప్పుకుంటే వద్దని యామిని అనగానే లేదు నాకు ఇష్టమే అని రాజ్ అంటాడు. ఆ తర్వాత అప్పు, కావ్య ఇంటికెళ్తారు అసలు అతను బావనే అని నమ్ముతున్నావా అని కావ్యని అప్పు అడుగుతుంది.
నాకూ తెలుసు తాను మా ఆయనే అని కావ్య అంటుంది. అయితే వెళ్లి జరిగింది మొత్తం చెప్పమని అప్పు అంటుంది. తనకి గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదమని డాక్టర్స్ చెప్పారని కావ్య అంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది.. ఆక్సిడెంట్ అవ్వగానే యామిని తనని తన దగ్గరికి తీసుకొని వెళ్ళింది..ఇదంతా తన ప్లానేనా అని కావ్య అంటుంది. అసలేం జరిగిందో మొత్తం కనుక్కుంటానని అప్పు అంటుంది. ఆ లోపు ఆయన గురించి ఎవరికి చెప్పొద్దూ.. ఎందుకంటే అందరు తన దగ్గరికి వెళ్తారు. నువ్వు ఎవరికి అయిన చెప్తే ఒట్టే అంటు అప్పు దగ్గర మాట తీసుకుంటుంది కావ్య. మరొకవైపు యామిని వాళ్ళ నాన్న దగ్గరికి రాజ్ వచ్చి కూర్చుంటాడు. గతంలో నేను ఎవరైనా ప్రేమించాడమో అని.. నన్ను ఎవరైనా ప్రేమించడం జరిగిందా అని రాజ్ అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నావని యామిని వాళ్ళ నాన్న అంటాడు. ఒకవేళ వాళ్ళు నా ముందున్నా వాళ్ళని గుర్తుపట్టకుంటే బాధపడతారు కదా అని రాజ్ అనగానే అలా ఏం లేదని అతను చెప్తాడు. అప్పుడే వైదేహి వచ్చి డైవర్ట్ చేస్తుంది.
మరొకవైపు కావ్య దేవుడికి తన బాధని చెప్తూ ఏడుస్తుంది. అప్పుడే రాజ్ మెసేజ్ చేస్తాడు. అంటే ఇలా మెసేజ్ చేస్తున్నాడంటే తనకి ఆ యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు చాట్ చేసుకుంటారు మళ్ళీ మీ చేతి వంట తినాలని ఉందని కావ్యకి రాజ్ మెసేజ్ చేస్తాడు వండినప్పుడు పంపిస్తానని కావ్య చెప్తుంది. ఒకసారి కలవాలని మెసేజ్ చెయ్యనా అని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో కావ్య ఒక హోటల్ లో రాజ్ కోసం వెయిట్ చేస్తుంది. కావ్య తనలో తాను మాట్లాడుకుంటుంటే.. రాహుల్, రుద్రాణి ఇద్దరు కావ్యని వీడియో తీస్తారు. దీన్ని ఇంట్లో అందరికి చూపించాలని అనుకుంటారు. రాహుల్, రుద్రాణి వెళ్లిపోతుంటే రాజ్ అప్పుడే లోపలికి వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
